మునగపాక మండలం పాటిపల్లిశ మోడల్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని కోరారు. ఓసి బిసి ఓబీసీలకు రూ. 200, ఎస్సీ ఎస్టీలకు రూ. 150 ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.