మునగపాక మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కూటమి నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం మునగపాకలో కూటమి శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మండల టిడిపి అధ్యక్షులు డి శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ కూటమి శ్రేణులు అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.