అగ్ని బాధితులకు పక్కా గృహాలు: ఎమ్మెల్యే సుందరపు

63చూసినవారు
అగ్ని బాధితులకు పక్కా గృహాలు: ఎమ్మెల్యే సుందరపు
మండలంలో వెదురువాడ గ్రామంలో అగ్ని బాధితులకు సొంత నిధులతో పక్కా గృహాలు నిర్మిస్తానని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మంగళవారం తెలిపారు. ఈ ప్రమాదంలో వీరు కట్టుబట్టలతో మాత్రమే మిగిలారు. నిరుపేదలైన వీరికి తన సొంత నిధులతో పక్కా గృహాలు నిర్మించిస్తానని వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని వీఆర్వో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెదురువాడ సర్పంచ్ కొయ్య శ్రీనివాస్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మోటూరు శ్రీవేణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్