రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు గురువారం చెప్పారు. మోటారు మరమ్మతులకు గురి కావడం వల్ల నాలుగు రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి మంచినీరును తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. సమస్యను గురువారం ఎండీఓ కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సీఐటీయూ నాయకులు వై. రాము తెలిపారు.