రాంబిల్లి మండలం మర్రిపాలెం శివారు రాజారాయుడుపాలెంలో సీసీ రోడ్డు నిర్మాణానికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతి సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.