సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవులను అభివృద్ధి చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. రాంబిల్లి మండలం సీతంపాలెం సముద్ర తీర ప్రాంతంలో ఉపాధి పథకం కింద వాస్కా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మడ అడవులు అభివృద్ధిలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మడ అడవులు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.