రాంబిల్లి: పాల సేకరణ ధరను పెంచాలి

67చూసినవారు
రాంబిల్లి: పాల సేకరణ ధరను పెంచాలి
పాల సేకరణ ధరను పెంచాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము డిమాండ్ చేశారు. రాంబిల్లి మండలం భోగాపురం పాల సేకరణ కేంద్రం వద్ద గురువారం పాడి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ డెయిరీ ఆవుపాల ధరను రూ. 3 తగ్గించిందన్నారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి కూడా రావడంలేదని అన్నారు. పాలధరను తగ్గించిన యజమాన్యం డెయిరీ ఉత్పత్తుల ధరలను పెంచిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్