రాంబిల్లి ఎస్ ఈ జెడ్ వినూత్న ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ కుమార్ ఉరి వేసుకుని మృతి చెందాడు. రాంబిల్లి ఎస్ఐ నాగేంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు తొమ్మిదవ తారీఖున సాయంత్రం 6 గంటల సమయంలో విధులుకి వెళ్లగా శుక్రవారం ఉదయం 10 గంటలకు వేలాడుతూ కనిపించాడు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంబిల్లి ఎస్ఐ నాగేంద్ర తెలిపారు.