రాంబిల్లి శివారులోని కుండలదేవునిపాలెంకు చెందిన ఈరుగుల కృష్ణ (36) ఈ నెల 1న జంగాలపాలెం వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడాడు. అచ్యుతాపురం మండలం ఇరువాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ అతను శుక్రవారం రాత్రి మృతిచెందాడు. అతనికి తల్లిదండ్రులు అప్పారావు, బంగారమ్మ, భార్య జ్యోతి, కుమారులు జస్వంత్, రితిక్ ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ నరసింగరావు తెలిపారు.