నునపర్తి హరి హర పంచాయతన క్షేత్రం (సిద్దాశ్రమం)లో రథసప్తమి సందర్భంగా ఉషా, ఛాయా పద్మిని సామెత సూర్య నారాయణ స్వామి కళ్యాణం మంగళవారం అత్యంత వైభవంగా జరిపారు. ఉదయం నుండి సూర్య మండపం, సౌర హెూమం, సూర్య నమస్కారాలు, వేద పండితులు గండి కోట వెంకట బ్రహ్మ శ్రీనివాస శర్మ జరిపించారు. మొలకలు, దుంపలు రేగి పండులు కలిసిన ప్రసాదం పంపిణి చేశారు. సాయంత్రం తీరు విధి చక్రస్నానం జరిపినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.