భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, కొండకర్ల, దోసూరు, అచ్చుతాపురం గ్రామాల్లో సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాము మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆపివేస్తూ గత ప్రభుత్వం మెమో 12, 14 విడుదల చేసిందని దీంతో లక్షలాదిగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదునీ వెంటనే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ మేమో ను రద్దు చేసి కార్మికుల వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.