విద్యార్థినులకు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని యలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి పి. విజయ సూచించారు. ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో బుధవారం వివిధ అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. 18 ఏళ్ల లోపు వయసు గలిగిన విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగితే తల్లిదండ్రులు, పాఠశాల యజమాన్యానికి తెలియజేయాలని ఆమె అన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.