కళలకు గ్రామాలే పుట్టినిల్లు అని జబర్దస్త్ ఆర్టిస్టు సత్తిపండు. అన్నారు. మండలంలోని యర్రవరం గ్రామానికి చెందిన వర్ధ మాన దర్శకుడు పీఏ వెంకట్ గ్రామీణ కళాకారులతో నిర్మిం చిన 'గరళం' అనే లఘు చిత్రాన్ని హరిపాలెంలో శనివారం సాయంత్రం ఆయన విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కర్రి శ్రీను, కె. కిరణ్, తారాగణం పి. జగదీష్, ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.