యలమంచిలి పురపాలక సంఘంలో గత కొన్ని నెలలుగా కుక్కల సంఖ్య అధికమై ప్రజలకు కలిగే ఇబ్బంది దృష్ట్యా ప్రజల నుండి మీడియా నుంచి వచ్చిన ఫిర్యాదులను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. కౌన్సిల్ ఆమోదంతో అనిమల్ బర్త్ కంట్రోల్-2023 నిబంధనలకు అనుగుణంగా కుక్కలకు జంతు నియంత్రణ ఆపరేషన్ ను స్థానిక వెటర్నరీ హాస్పిటల్ నందు శుక్రవారం మొదలుపెట్టినట్టు పురపాలక సంఘం కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.