బుద్ధి మాంద్యం గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ వారికి విద్యా బుద్ధులు నేర్పేందుకు తర్ఫీదు పొందిన ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. మెగా డీఎస్సీలో ప్రత్యేక పోస్టులు కేటాయించాలన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించే చర్యలు తీసుకోవాలన్నారు.