యలమంచిలి మండలం లైన్ కొత్తూరు శ్రీ శక్తి భవన్ లో బుదవారం మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటమణి ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళ సమీక్ష అధ్యక్షులకు, వీఓఎలకు రేగుపాలెం పీహెచ్సీ డా. శిరీష, డా. ఝాన్సీలు క్యాన్సర్ పై అవగాహన కలిగించారు. క్యాన్సర్ నీ తొలి దశలో గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. సిబ్బంది శ్రీనివాసు రావు, లీలా కుమారి, సత్యవేని, సుధీర్, రాణి, పాల్గొన్నారు.