యలమంచిలి మండలంలోని జంపపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ యలమంచిలి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పి అప్పారావు మంగళవారం ఏనుగుతుని గ్రామంలోని విద్యార్థులు ఇళ్లకు నైట్ విజిట్ చేశారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తూ ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.