యలమంచిలి మండలంలోని పలు ఉన్నత పాఠశాలలను ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ శనివారం పరిశీలించారు. జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని, పిఆర్సి ప్రకటించే వరకు ఐఆర్ ప్రకటించాలని విద్యాబోధన తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుండి తప్పించాలని యాప్స్ తగ్గించాలని అయన ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడం జరిగిందన్నారు.