చదువుకున్న యువతీ యువకులకు కూటమి ప్రభుత్వంలో జాబ్ గ్యారంటీగా వస్తుందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంచెలంచెలుగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు