యలమంచిలి మండలం పరిధిలో కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఓ లారీ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న లారీ కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ క్లీనర్ లను స్థానికులు బయటకు తీశారు.