కార్మిక, రైతు, యువజన వామపక్ష పార్టీలకు చెందిన నాయకుల అరెస్టులను ఖండిస్తూ సీఐటీయూ, ఎస్ఎఫ్ఎ, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ ఎలమంచిలి మండలం కార్యదర్శి సిహెచ్. శివాజీ మాట్లాడుతూ ప్రధాని మోదీ విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తేకపోవడం విచారకరం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలన్నారు.