యలమంచిలి మున్సిపాలిటీ పరిదిలో సోమలింగపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్దులకు మున్సిపాలిటీ ఒకటవ వార్డ్ టీడీపీ ఇన్చార్జి యల్లపు శ్రీను స్టడీ మెటీరియల్ ఉచితంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్దులు అందరూ పబ్లిక్ పరీక్షలకు ఏటువంటి భయాందోళనలు లేకుండా సన్నద్ధం కావాలని, మంచి మార్కులు సాధించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు బోదేపు సాయిబాబు, ఉపాధ్యుయులు పాల్గొన్నారు.