యలమంచిలి నియోజకవర్గ నుంచి పిఠాపురంలో ఈనెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభకు ర్యాలీగా తరలి వెళ్లాలని జనసేన నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు సమావేశం అయినట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నుంచి భారీ స్థాయిలో తరలి వెళుతున్నట్లు తెలిపారు.