విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకు బదిలీ

4చూసినవారు
విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకు బదిలీ
AP: విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకు బదిలీ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ నుంచి జిల్లా పోలీసులకు ఉత్తర్వులు అందాయి. ఉగ్ర పేలుళ్ల కుట్రపై మే 16న విజయనగరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేయగా ప్రధాన నిందితులు సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌(29), సయ్యద్‌ సమీర్‌(28) రిమాండ్‌లో ఉన్నారు. ఎన్‌ఐఏకు బదిలీ తర్వాత ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం కానుంది.

సంబంధిత పోస్ట్