ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో వారిలో ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య మండిపడ్డారు. వచ్చే నెల 2 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. తదుపరి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.