ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు!

54చూసినవారు
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు!
AP: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ నెల 27న జరిగే ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీ అభ్యర్థులపై పోటీకి వాలంటీర్లు సిద్ధమైనట్లు టాక్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన మాటను తప్పడంతో కూటమి అభ్యర్థులను దెబ్బతీయాలని భావిస్తున్నారట. గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాలంటీర్ శివగణేశ్, కృష్ణా-గుంటూరు నుంచి వాలంటీర్ లంక గోవింద రాజును పోటీలో దింపనున్నారట.

సంబంధిత పోస్ట్