వాలంటీర్ వ్యవస్థపై ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది.‘ఏపీలో వాలంటీర్లు పని చేయడం లేదు. వాలంటీర్ వ్యవస్థే లేదు. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తేనే జీతాలు పెంచుతామని అన్నాం. రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకోవడం కుదరదు.’ అని మంత్రి బాల వీరాంజనేయులు తెలిపారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. ‘వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పడం దారుణం. వాలంటీర్లకు రెన్యూవల్ జీవోలు ఇవ్వాలి.’ అని అన్నారు.