AP: సారాపై యుద్ధం చేయడానికి నవోదయం 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నవోదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వెబ్ సైట్ ప్రారంభించి విద్యార్థులతో ప్రమాణం చేయించారు. అనంతరం జెండా ఊపి నవోదయం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నవోదయాన్ని గాలికి వదిలి ఊరూరా సారాను విస్తరించిందని ఆరోపించారు.