AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజుల్లో దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. అయితే హిందూ మహా సముద్రంతో పాటు ఆగ్నేయ ఆసియాలో మూడు తుఫాన్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేఘాలన్నీ బంగాళాఖాతం వైపు కదులుతుండటంతో తుఫాన్‌కు అవకాశం ఉందేమోనని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదన్నారు.