AP: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు భవనం మూడో అంతస్తుపై నుంచి పడి వాచ్‌మెన్ సురేశ్ మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడు కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.