ఏపీలో మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడమే కాదు.. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని తెలిపారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని అన్నారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయని.. కార్యకర్తలు ఓర్చుకోవాలని జగన్ దైర్యం చెప్పారు.