AP: టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీటీడీ ఈవో శ్యామల రావు స్పందిస్తూ..గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా.. 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. అయితే అవి సహజ మరణాలేనన్నారు. ఈ ఏడాదిలో 59 లేగ దూడలు జన్మించాయన్నారు.