AP: కూటమి ప్రభుత్వ, ఏర్పడి నేటికీ సరిగ్గా ఏడాది పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. విధ్వంస పాలన నుండి వికాస పాలన వైపు అడుగులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే ప్రభుత్వానికి రెండు కళ్లన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పామని, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపమోగిస్తున్నామని వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వనివీ కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.