కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ఆర్జి కర్ నర్సులు స్పందిస్తూ.. తాము అభద్రతాభావంతో ఉన్నామని, బాధపడ్డామని చెప్పారు. ‘మాకు భద్రత లేదు, ఎవరైనా కాలేజీలోకి ప్రవేశిస్తున్నారు, అలాంటి వాతావరణంలో మేము పని చేయలేము’ అని చెప్పారు. తమకు రక్షణ కల్పించడంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు విఫలమయ్యారని, కేంద్ర సాయుధ బలగాలు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.