AP: ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమ అరెస్టులను తాము ఖండిస్తున్నామని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. దొంగ సాక్ష్యాలు, అబద్ధపు స్టేట్మెంట్స్‌తో ఈ అరెస్ట్ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. కాగా ఏపీ లిక్కర్ స్కాంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.