వివేకా హత్య కేసులో మాకు న్యాయం జరగలేదు: సునీత

67చూసినవారు
వివేకా హత్య కేసులో మాకు న్యాయం జరగలేదు: సునీత
AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తమకు ఇంకా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగితా వాళ్లంతా బయట తిరుగుతున్నారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు.’ అని సునీత చెప్పారు.

సంబంధిత పోస్ట్