లోక్‌సభలో ప్రధాని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో పుట్టని 10 కోట్ల మంది లబ్ధి పొందితే, బీజేపీ వచ్చాక అసలైన పేదలకు లబ్ధి చేకూర్చామన్నారు. గత పదేళ్లలో దేశంలోని 4 కోట్ల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించామని అలాగే 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ భారత్‌కు అడుగులు వేశామన్నారు. పేదలకు ఇచ్చిన ప్రతి హామీని తాము నెరవేర్చామని వెల్లడించారు.