గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ సాధనే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 'రాష్ట్రపతి ప్రసంగం ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తోంది. తమలో రాష్ట్రపతి ప్రసంగం ఆత్మవిశ్వాసం నింపింది. మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయి. తమ ప్రభుత్వం ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇవ్వడంపై దృష్టి పెట్టింది’ అని వ్యాఖ్యానించారు.