AP: రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించామని మంత్రి లోకేశ్ తెలిపారు. “స్కూళ్లు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు అందించామని.. మిగిలిన 20శాతం మందికి ఈనెల 20వ తేదీ లోపు అందిస్తామని వెల్లడించారు. అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.13 వేలు అందజేస్తామని లోకేశ్ పేర్కొన్నారు.