దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలోనే అసలైన అభివృద్ధిని చేసి చూపించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తమ పాలనలో గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యం కోసం నిరంతరం పని చేస్తున్నామని వెల్లడించారు.