హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ హత్య జరిగింది. అయితే, హనియే హత్యలో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ బుధవారం తెలిపారు. సింగపూర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్లింకెన్ మాట్లాడుతూ.. దీని గురించి తమకు తెలియదని, దీంట్లో తమ ప్రమేయం లేదని చెప్పారు.