AP: మూడేళ్లలో అమరావతి రాజధాని పూర్తి అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేయడం, లే అవుట్ డిజైన్, ఐకానిక్ టవర్స్ కోసం సమయం తీసుకోవడం వల్లనే గతంలో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. టార్గెట్ ఇచ్చామని, ఆ టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేస్తున్నారని చెప్పారు. గత ఏడాదిలోనే టెండర్లను పిలిచి పనులు అప్పగించామని అన్నారు. అందులో కూడా తొమ్మిది నెలలు పని జరిగిందని చెప్పారు.