త్వరలోనే మరో తేదీ నిర్ణయిస్తాం: మంద కృష్ణమాదిగ

55చూసినవారు
త్వరలోనే మరో తేదీ నిర్ణయిస్తాం: మంద కృష్ణమాదిగ
ఫిబ్రవరి 7న తలపెట్టిన ‘లక్షల డప్పులు.. వేల గొంతుల’ సాంస్కృతిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. త్వరలోనే మరో తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. ప్రభుత్వం, పోలీసు శాఖ వివిధ సాకులు చూపుతూ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం గతేడాది డిసెంబరు 9న సచివాలయం వద్ద లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించిందని, తమ ప్రదర్శనకు అనుమతి ఎందుకు ఇవ్వరని నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్