కూటమి ప్రభుత్వం చేపట్టిన 'తల్లికి వందనం' పథకం తొలియేడాదిలోనే అమలవుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇప్పటివరకు 67 లక్షలకు పైగా తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.8745 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. జూన్ 26 వరకు మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లోనూ డబ్బు వేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 36 లక్షల బీసీలు, 12 లక్షల ఎస్సీలు, 4.2 లక్షల ఎస్టీలు, 66 వేల మైనార్టీలు, 8.5 లక్షల ఈబీసీలు లబ్ధి పొందారని తెలిపారు.