ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్‌లోకి ఏటా రూ.14వేలు చొప్పున వేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.8 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.14వేలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.