వీరయ్య హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: లోకేష్

61చూసినవారు
వీరయ్య హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: లోకేష్
AP: ఒంగోలులో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (M), అమ్మనబ్రోలులోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి వెళ్లారు. వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీతో తనకున్న అనుబంధాన్ని లోకేశ్‌ గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్