AP: ప్రభుత్వ విధానాలు బాగోకపోతే ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా తాము ప్రజల కోసం పోరాడతామని ఆయన అన్నారు. అయితే.. సూపర్ సిక్స్ అంటే నాలుక మందం అని సీఎం చంద్రబాబు.. మరోవైపు అడిగితే తాట తీస్తా.. మక్కెలు ఇరగ్గొడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.