ఏపీలో మే నెలాఖరు లేదా జూన్ 12 లోగా అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దేవాలయాల పాలక మండళ్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు భర్తీ అవుతాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా (జూన్ 12) అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.