తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై విమర్శలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో రాష్ట్రానికి విద్యారంగ నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. ఇది అసమాన్యమని, విద్యను రాజకీయాలకు అతీతంగా చూడాలని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ విషయంపై తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని వెల్లడించారు. విద్యారంగంపై దాడిని తాము తిప్పికొడతామని స్పష్టం చేశారు.