ఆడబిడ్డ నిధి పథకంపై సీఎం చంద్రబాబు కర్నూలు సభలో మాట్లాడారు. ఇప్పటికే పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని, త్వరలో తల్లికి వందనం, బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. అయినప్పటికీ పేద మహిళలు మిగిలితే, వారికి ఆడబిడ్డ నిధిని P4 కార్యక్రమానికి అనుసంధానించి జమ చేస్తామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకారం 18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తామన్నారు.